Sree Leela out of DJ Tillu 2: డీజే టిల్లు 2 నుంచి శ్రీలీల ఔట్.. ఏమైందంటే?
Sree Leela out of DJ Tillu 2 due to an some issues: డీజే టిల్లు 2 సినిమా నుంచి శ్రీ లీల హీరోయిన్ గా తప్పుకుందని తెలుస్తోంది. ఆ వివరాలు
Sree Leela out of DJ Tillu 2 due to an some issues: ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న సినిమాల జాబితాలో డీజే టిల్లు కూడా ఒకటి. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందిస్తామని అప్పట్లోనే ప్రకటించారు నిర్మాతలు. ఆ ప్రకటించిన మేరకు ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది కూడా.
ఇక ఈ రెండో సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించడం లేదని మరో హీరోయిన్ ను సినిమా కోసం తీసుకుంటున్నారు అని ప్రచారం జరిగింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు యంగ్ హీరోయిన్ శ్రీ లీల అని గతంలో అనుకున్నారు. ఆమెకు కథ చెప్పగా దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు డీజే టిల్లు 2 సినిమా నుంచి కొన్ని అనుకోని కారణాలతో శ్రీ లీల బయటకు వచ్చేసిందని తెలుస్తోంది.
పెళ్లి సందడి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడలో కిస్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె తర్వాత కన్నడలో మరో సినిమా కూడా చేసింది. అయితే తెలుగులో ఆమె చేసిన పెళ్లి సందడి సినిమా ఆమెకు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇక ప్రస్తుతానికి ఆమె అనగనగా ఒక రోజు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వారాహి చలనచిత్రం నిర్మిస్తున్న ఒక సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. .అది గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటిరెడ్డి సినిమా అని అంటున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో కూడా ఆమె పాల్గొంది. దీంతో ఆమె అదే సినిమాలో హీరోయిన్గా నటిస్తోందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ విషయం మీద మాత్రం ఇప్పటివరకు అధికారికంగా క్లారిటీ లేదు.
Also Read: Shaakuntalam Release Date: అవన్నీ పుకార్లే.. సమంత విషయంలో గుడ్‌న్యూస్ చెప్పిన దిల్ రాజు!
Also Read: Krishna Vrinda Vihari Review: కృష్ణ వ్రింద విహారి సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook